Published on Mar 24, 2025
Current Affairs
ఐఎంఎఫ్‌ గణాంకాలు
ఐఎంఎఫ్‌ గణాంకాలు

భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గత పదేళ్లకాలంలో (2015-25) గణనీయంగా పెరిగింది. 2015లో 2.1 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్న జీడీపీ 2025 నాటికి 4.3 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది.

దాదాపు 105% పెరిగింది. ఈ పదేళ్ల కాలంలో జీడీపీ వృద్ధి రేటు 77 శాతంగా ఉంది.

ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ఇది ఎంతో మెరుగ్గా ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన గణాంకాలు వెల్లడించాయి.

ఈ వేగవంతమైన వృద్ధి భారత్‌ను ప్రపంచంలోని తొలి ఐదు ఆర్థిక వ్యవస్థల జాబితాలో చేర్చింది.

ఇదే స్థాయిలో వృద్ధి కొనసాగితే 2025 నాటికి జపాన్‌ను, 2027 కల్లా జర్మనీని అధిగమించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.