Published on Apr 19, 2025
Walkins
ఐఎఆర్‌ఐ, న్యూదిల్లీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు
ఐఎఆర్‌ఐ, న్యూదిల్లీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు

ఐకార్‌- ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, న్యూదిల్లీ - తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09

వివరాలు:

1. ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌(పీపీఏ): 01

2. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2: 01

3. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 01

4. ఎస్‌ఆర్‌ఎఫ్‌: 02

5. యంగ్‌ ప్రొఫెషనల్-1: 01

6. ఫీల్డ్‌ కమ్‌ ల్యాండ్‌ వర్కర్‌: 01

7. యంగ్‌ ప్రొఫెషనల్‌-3: 02

అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ, ఎంఎస్సీ/ ఎంటెక్‌/ ఎంఈ/ ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు 40 ఏళ్లు; ఇతర 35 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు పీపీఏకు రూ.49,000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు రూ.35,000; ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.20,000; ఎస్‌ఆర్‌ఎఫ్‌కు రూ.37,000; యంగ్‌ ప్రొఫెషనల్స్‌కు రూ.30,000- రూ.42,000; ఫీల్డ్‌ కమ్‌ ల్యాండ్‌ వర్కర్‌కు రూ.18,000.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: మే 13 లేదా 14 తేదీల్లో.

దరఖాస్తులు పంపాల్సిన ఇ-మెయిల్‌:e-mail muneshiari1@gmail.com (contact no.- 011-25846359)

దరఖాస్తు చివరి తేది: 06-05-2025.

Website:https://iari.res.in/bms/announcements/jobs.php