ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ), వెస్ట్ జోన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన హాస్పిటాలిటీ మానిటర్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు:
హాస్పిటాలిటీ మానిటర్: 43 పోస్టులు
అర్హత: బీఎస్సీ(హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్/ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ సైన్స్). లేదా బీబీఏ/ఎంబీఏ(కలినరీ ఆర్ట్స్)/ ఎంబీఏ(టూరిజం అండ్ హోటల్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.30,000, ఇతర అలెవెన్సులు.
వయోపరిమితి: 01.08.2026 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీలు: 17, 24, 27.02.2026; 05.03.2026.
వేదిక: మధ్యప్రదేశ్, ముంబయి, గోవా, గుజరాత్.
Website:https://irctc.com/