Published on Sep 28, 2024
Walkins
ఐఆర్‌సీటీసీ, నార్త్‌ జోన్‌లో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు
ఐఆర్‌సీటీసీ, నార్త్‌ జోన్‌లో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ), నార్త్‌ జోన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన హాస్పిటాలిటీ మానిటర్ ఖాళీల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టులు: 15

వివరాలు:

అర్హత: బీఎస్సీ(హాస్పిటాలిటీ అండ్‌ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌/ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్‌ క్యాటరింగ్ సైన్స్). లేదా బీబీఏ/ఎంబీఏ(కలినరీ ఆర్ట్స్)/ ఎంబీఏ(టూరిజం అండ్‌ హోటల్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.  

వేతనం: నెలకు రూ.30,000, ఇతర అలెవెన్సులు.

వయోపరిమితి: 01.08.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. 

పని ప్రదేశం: దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, చండీగఢ్, జమ్మూ-కశ్మీర్.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ఇంటర్వ్యూ తేదీ: 25-10-2024.

వేదిక: న్యూదిల్లీ, జైపుర్‌, లఖ్‌నవూ, చండీగఢ్. 

Website:https://irctc.com/new-openings.html