Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 16, 2026
Current Affairs
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహం
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహం

భారత్‌ సొంతంగా అభివృద్ధి చేసుకున్న ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ (నావిక్‌)లో ప్రస్తుతం క్రియాశీలంగా ఉన్న నాలుగు ఉపగ్రహాల్లో ఒకటి విఫలమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధికారులు తెలిపారు. దీంతో ఈ వ్యవస్థ ద్వారా అందే నేవిగేషన్‌ సేవలు నిలిచిపోయాయి. 

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌1-ఎఫ్‌ అనే ఉపగ్రహాన్ని 2016 మార్చి 10న నింగిలోకి ప్రయోగించారు. అందులోని మూడు పరమాణు గడియారాల్లో రెండు ఇప్పటికే విఫలమయ్యాయి. చిట్టచివరి సాధనం తాజాగా మొరాయించింది. దీంతో ఆ శాటిలైట్‌.. దిక్సూచి సేవలకు అక్కరకు రాని పరిస్థితి తలెత్తింది.