తమిళనాడు రాష్ట్రం మనవలకురిచి, కన్యకూమారి జిల్లాలోని ది ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ (ఐఆర్‌ఈఎల్) గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తికి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 41
వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 04
2. టెక్నికల్ : 04
3. ట్రేడ్ అప్రెంటిస్: 33
విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, వెల్డర్, ఎలక్ట్రానిక్/ ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, టర్నర్, ప్లంబర్, ఫిట్టర్, కార్పెంటర్, ల్యాబ్ అసిస్టెంట్, పీఏఎస్‌ఏఏ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీఎస్సీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల మార్కుల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ది చీఫ్ మేనేజర్- హెచ్‌ఆర్‌ఎం (లీగల్ అండ్ ఈఆర్), ఐఆర్‌ఈఎల్ లిమిటెడ్, మనవలకురిచి, కన్యాకుమారి జిల్లా తమిళనాడు. (అభ్యర్థులు సంబంధిత అప్రెంటిస్ పోర్టల్‌లో నమోదు చేసుకోని ఉండాలి).
దరఖాస్తు చివరి తేదీ: 20.09.2025.
Website:https://irel.co.in/