Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 14, 2026
Apprenticeship
ఐఆర్‌ఈఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు
ఐఆర్‌ఈఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

కేరళ రాష్ట్రం చవారాలోని ది ఇండియన్‌ రేర్‌ ఎర్త్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌ఈఎల్‌) గ్రాడ్యుయేట్‌& టెక్నీషియన్‌ అండ్‌ ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తికి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 89

వివరాలు:

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌- 15

2. టెక్నికల్‌ : 09

3. ట్రేడ్‌ అప్రెంటిస్‌: 51

4. జనరల్‌ స్ట్రీమ్‌ స్టడీస్‌: 14

విభాగాలు: ఎలక్ట్రికల్‌, సివిల్‌, మెకానికల్‌, వెల్డర్‌, ఎలక్ట్రానిక్‌/ ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, టర్నర్‌, ప్లంబర్‌, ఫిట్టర్‌, కార్పెంటర్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, ఏఏఓ, ఎంఎల్‌టీ, ఎగ్జిక్యూటివ్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీకాం, బీఏ/బీబీఏ/బీఎస్సీ, ఎంఎస్సీ, వీహెచ్‌ఎస్‌ఈ, బీటెక్‌/బీఈ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల మార్కుల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ది డీజీఎం, ఐఆర్‌ఈఎల్‌ ఇండియా లిమిటెడ్‌, చవారా, కొల్లం జిల్లా, కేరళ చిరునామాకు సంబంధిత ధ్రువపత్రాలను జత చేసి పంపించాలి.(అభ్యర్థులు సంబంధిత అప్రెంటిస్‌ పోర్టల్‌, ఎన్‌ఏటీఎస్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోని ఉండాలి).

దరఖాస్తు చివరి తేదీ: 24-02-2026.

Website:https://irel.co.in/