చెన్నైలోని ఆర్మ్‌డ్ వెహికిల్ నిగమ్ లిమిటెడ్ ( ఏవీఎన్‌ఎల్) ఫిక్స్‌డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
యంగ్ ప్రొఫెషనల్- 04
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/ ఎంబీఏ/ పీజీ ఉత్తీర్ణత, ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.40,000.
వయోపరిమితి: 27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అభ్యర్థుల విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఈడబ్ల్యూఎస్/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను స్పీడ్ పోస్ట్/ కొరియర్ ద్వారా చీఫ్ జనరల్ మేనేజర్, ఏవీఎన్‌ఎల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్, ఏవీఎన్‌ఎల్ (హెచ్‌వీఎఫ్) ఎస్టేట్, అవధి, చెన్నై చిరునామాకు పంపించాలి.
చివరి తేదీ: 12-12-2024.
Website:https://avnl.co.in/