చెన్నైలోని ఆర్ముడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (ఏవీఎన్‌ఎల్) ఆవడి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో జూనియర్ టెక్నీషియన్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 133
వివరాలు:
1. జూనియర్ టెక్నీషియన్: 130
2. జూనియర్ మేనేజర్: 01
3. డిప్లొమా టెక్నీషియన్: 02
విభాగాలు: టర్నర్, మెషినిస్ట్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ ఫిట్టర్, ఎలక్ట్రిక్ ఫిట్టర్, మిల్‌రైట్, ఎగ్జామినర్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, టూల్ డిజైన్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్), డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 నవంబర్ 21వ తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు జూనియర్ టెక్నీషియన్‌కు రూ.34,227, జూనియర్ మేనేజర్‌కు రూ.47,610, డిప్లొమా టెక్నీషియన్‌కు రూ.37,201.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 నవంబర్ 21.
చిరునామా: చీఫ్ జనరల్ మేనేజర్, ఏవీఎన్‌ఎల్, మెషిన్ టూల్ ప్రోటోటైప్ ఫ్యాక్టరీ, ఆర్డినెన్స్ ఎస్టేట్, అంబర్‌నాథ్, జిల్లా. థానే, మహారాష్ట్ర- 421 502.
Website:https://ddpdoo.gov.in/career