Published on Jun 16, 2025
Government Jobs
ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు
ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 122

వివరాలు:

1. కాంట్రాక్ట్‌: 46

2. ఔట్‌ సోర్సింగ్: 76

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్‌/బీఈ, డిప్లొమా, ఇంటర్‌, టెన్త్‌, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్‌/పీహెచ్‌డీ, డీఎంఎల్టీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 42 ఏళ్లు.

జీతం: నెలకు రూ.15,000 -  రూ.54,060.

దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.250. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 జూన్‌ 2.

దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్‌ 16.

చిరునామా: ప్రిన్సిపాల్ కార్యాలయం, డా.ఎల్లాప్రగడ సుబ్బారావు, ప్రభుత్వ వైద్య కళాశాల, ఏలూరు చిరునామాకు దరఖాస్తులు పంపించాలి.

Website: https://eluru.ap.gov.in/notice_category/recruitment/