Published on May 16, 2025
Government Jobs
ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో పోస్టులు
ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో పోస్టులు

ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 23

వివరాలు:

1. ప్రాజెక్టు అడ్మిన్‌ అసిస్టెంట్(పీపీఏ): 09

2. ప్రాజెక్టు సీనియర్‌ అడ్మిన్‌ అసిస్టెంట్‌(పీఎస్‌ఏఏ): 06

3. ప్రాజెక్టు అడ్మిన్‌ ఆఫీసర్‌(పీఏఓ): 04

4. ప్రాజెక్టు టెక్నికల్‌ అసిస్టెంట్(పీటీఏ): 02

5. ప్రాజెక్టు సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్(పీఎస్‌టీఏ): 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2025 జూన్‌ 13వ తేదీ నాటికి పీపీఏ, పీటీఏకు 35 ఏళ్లు, పీఎస్‌టీఏ, పీఎస్‌ఏఏకు 45 ఏళ్లు, పీఏఓకు 50 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు పీపీఏకు రూ.35,220, పీఎస్‌ఏఏకు 47,496, పీఏఓకు రూ.59,276, పీటీఏకు రూ.35,220, పీఎస్‌టీఏకు రూ.50, 224.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 జూన్‌ 13

Website: https://ada.gov.in/