ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్ 2024, అక్టోబరు 28న ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ వీరితో ప్రమాణం చేయించారు.
ఏపీ హైకోర్టుకు ఆమోదిత మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37 (28 శాశ్వత, 9 అదనపు)గా ఉంది. ప్రస్తుతం హైకోర్టులో 26 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన ముగ్గురితో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది.