Published on Oct 15, 2025
Current Affairs
ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు
ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు

జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్‌ దొనాడి రమేశ్, జస్టిస్‌ సుభేందు సామంత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు. వీరి బదిలీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, అక్టోబరు 14న ఆమోదముద్ర వేశారు. గుజరాత్‌ హైకోర్టు నుంచి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్, అలహాబాద్‌ హైకోర్టు నుంచి జస్టిస్‌ రమేశ్‌ తిరిగి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు(మాతృ హైకోర్టు) వస్తున్నారు. కోల్‌కతా హైకోర్టు నుంచి జస్టిస్‌ సుభేందు సామంత రానున్నారు. ఈ ముగ్గురి రాకతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరుతుంది.