ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ 2024, డిసెంబరు 29న నియమితులయ్యారు.
ఈయన 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుత సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ పదవీకాలం డిసెంబరు 31తో ముగుస్తుండటంతో ప్రస్తుత నియామకం జరిగింది.
వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె విజయానంద్ స్వస్థలం. 2025 నవంబరులో విజయానంద్ పదవీ విరమణ చేయనున్నారు.