కేంద్ర జౌళి శాఖ 2023, 2024 సంవత్సరాలకు ప్రకటించిన ‘జాతీయ హస్తకళ’ అవార్డులకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు కళాకారులు ఎంపికయ్యారు. ఇందులో డి.శివమ్మ (తోలుబొమ్మలాట) శిల్పగురు-2023, బ్రహ్మానంద మహారాణ (రాతి శిల్పం), గోర్సా సంతోష్‌కుమార్ (ఆటబొమ్మలు, గాలిపటాలు)లు జాతీయ హస్తకళ 2023, 2024 అవార్డులు గెలుచుకున్నారు.