Published on Jun 8, 2025
Government Jobs
ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు
ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏపీఎంఎస్‌ఆర్‌బీ) ద్వారా నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ (ఎన్‌ఎంహెచ్‌పీ), టెలి మానస్‌ సెల్‌లలో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన కింది

పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 76

వివరాలు:

1. కన్సల్టెంట్‌ సైకియార్టిస్ట్‌: 12

2. క్లినికల్ సైకాలజిస్ట్‌: 19

3. సైకియార్టిక్‌ సోషల్‌ వర్కర్‌: 06

4. కౌన్సిలర్‌: 36

5. టెక్నికల్‌ కో-ఆర్డినేటర్‌: 01

6. డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 02

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్‌/బీఈ, ఎంబీబీఎస్‌, డిప్లొమా, పీజీ, ఎం.ఫిల్/పీహెచ్‌డీ, ఎంస్‌/ఎండీ, ఎంఎస్‌డబ్ల్యూలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 2025 జూన్‌ 5వ తేదీ నాటికి 42 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు క్లినికల్ సైకియార్టిస్ట్‌కు రూ.1,00,000, క్లినికల్ సైకాలజిస్ట్‌కు రూ.27,500, సైకియాట్రిక్‌ సోషల్‌ వర్కర్‌కు రూ.25,000, కౌన్సిలర్‌కు రూ.18,066, టెక్నికల్‌ కో-ఆర్డినేటర్‌కు రూ.40,000, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.18,450.

దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.1000, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, ఈఎస్‌ఎం, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.750.

ఎంపిక: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 జూన్ 18.

Website: https://apmsrb.ap.gov.in/msrb/