Published on Mar 26, 2025
Admissions
ఏపీ లాసెట్‌/ పీజీఎల్‌సెట్‌-2025
ఏపీ లాసెట్‌/ పీజీఎల్‌సెట్‌-2025

ఆంధ్రప్రదేశ్‌ లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ లాసెట్‌)/ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ లా కోర్స్‌ ఎల్‌ఎల్‌ఎం- (ఏపీ పీజీఎల్‌సెట్)-2025 నోటిఫికేఫన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు వాటి అనుబంధ కళాశాలల్లో 5, 3, 2 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం/ ఎంఎల్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. 

వివరాలు:  

ఆంధ్రప్రదేశ్‌ లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ లాసెట్‌)/ ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్‌ లాసెట్‌ (పీజీఎల్‌సెట్)-2025 

కోర్సులు: మూడేళ్లు/ అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం/ ఎంఎల్‌.

అర్హత: కోర్సును అనుసరించి 45 శాతం మార్కులతో ఇంటర్మీడియేట్‌, డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు: ఎల్‌ఎల్‌బీ కోర్సుకు- ఓసీ అభ్యర్థులకు రూ.900. బీసీలకు 850. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్ధులకు రూ.800. ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు- ఓసీ అభ్యర్థులకు రూ.1000. బీసీలకు రూ.950. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.900.

పరీక్ష విధానం: అబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఎల్‌ఎల్‌బీ కోర్సులకు పరీక్ష ఇంగ్లిష్‌, తెలుగు రెండు మాధ్యమాల్లో; ఎల్‌ఎల్‌ఎం పరీక్ష ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరించు తేదీలు: 25-03-2025 నుంచి 27-04-2025 వరకు.

రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేది: 28-04-2025 నుంచి 04-05-2025 వరకు.

రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేది: 05-05-2025 నుంచి 11-05-2025 వరకు.

రూ.4000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేది: మే 12 నుంచి 18వ తేదీ వరకు.

రూ.10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేది: మే 19 నుంచి 25 వరకు.

దరఖాస్తుల సవరణ తేదీలు: మే 26 నుంచి 27 వరకు.

హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: 30-05-2025.

ప్రవేశ పరీక్ష తేది: 05-06-2025.

ప్రాథమిక కీ విడుదల: 06-06-2025.

ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: జూన్‌ 07 నుంచి 08 వరకు.

తుది కీ: 16.06.2025.

ఫలితాలు విడుదల: 22.06.2025.

Website:https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_HomePage.aspx

Apply online:https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx