ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ ఒప్పంద ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ డివిజన్ ఆఫీస్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 30
వివరాలు:
1. ఫైనాన్స్- 15
2. టెక్నికల్- 08
3. లీగల్- 07
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/ సీఎంఏ/ ఎంబీఏ/ పీజీడీఎం (ఫైనాన్స్), బీటెక్, లా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ (ఎంఎస్ ఆఫీస్) పరిజ్ఞానం, ఉద్యోగానుభవం ఉండాలి. ఇంగ్లిష్, తెలుగులో రాయడం, మాట్లడటం వచ్చి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లోకల్ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
జీతం: నెలకు రూ.35,000.
వయోపరిమితి: 31.01.2025 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ రూ.590; ఎస్సీ/ ఎస్టీలకు రూ.354.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ టెస్ట్: మే నెలలో
పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కర్నూలు, తిరుపతి, హైదరాబాద్.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 11.04.2025.