ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్)-2025 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ఫుల్ టైం ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్.డి(పీబీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు:
ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్)-2025
కోర్సులు: ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఫార్మ్.డి (పీబీ)
విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, బయోఇన్ఫర్మేటిక్స్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, జియో- ఇన్ఫర్మాటిక్స్ తదితరాలు.
అర్హత: కోర్సును అనుసరించి బీఈ, బీటెక్, బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.1200; బీసీలకు రూ.900; ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.700.
ఏప్రిల్ 01 నుంచి 30 వరకు: ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు అవకాశం
మే 01 నుంచి 26 వరకు: రూ.1000 నుంచి రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం
మే 25- మే 27: దరఖాస్తు సవరణ తేదీలు
మే 31 నుంచి: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం
జూన్ 06 నుంచి 08 వరకు: ప్రవేశ పరీక్షలు
జూన్ 11: ప్రాథమిక కీ విడుదల తేదీలు
జూన్ 11 నుంచి 14: ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ
జూన్ 25: ఫలితాల వెల్లడి.
Website:https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx