Published on Dec 27, 2024
Government Jobs
ఏపీ దేవాదాయ శాఖలో ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
ఏపీ దేవాదాయ శాఖలో ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దేవాదాయశాఖలో ఇంజినీరింగ్‌ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 70.

వివరాలు:

1. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 35 పోస్టులు

2. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 05 పోస్టులు

3. టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్): 30 పోస్టులు

అర్హత: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎల్‌సీఈ డిప్లొమా, ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్‌ (సివిల్/ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది. 

వేతనం: నెలకు ఏఈఈకి రూ.35,000; టీఏకు రూ.25,000తో పాటు అదనపు అలవెన్సు చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 05-01-2025.

Website:https://escihyd.org/