Published on May 30, 2025
Government Jobs
ఏపీ డీడబ్ల్యూసీడబ్ల్యూలో ఉద్యోగాలు
ఏపీ డీడబ్ల్యూసీడబ్ల్యూలో ఉద్యోగాలు

ఏపీలోని డిస్ట్రిక్‌ ఉమెన్‌ & చైల్డ్‌ వెల్ఫేర్‌ & ఎంపవర్‌మెంట్ (డీడబ్ల్యూసీడబ్ల్యూ) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 05

వివరాలు:

1. మల్టీ పర్పస్‌ స్టాఫ్‌/కుక్‌: 03

2. సెక్యూరిటీ గార్డ్‌/నైట్ గార్డ్‌: 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 25 - 42 ఏళ్లు.

వేతనం: నెలకు మల్టీ పర్పస్‌ స్టాఫ్‌/కుక్‌కు రూ.13,000, సెక్యూరిటీ గార్డ్‌కు రూ.15,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: ఈ డీడబ్ల్యూ & సీడబ్ల్యూ& ఈవో, ఏఐఎంఎస్‌ కళాశాల కాంపౌండ్' 2వ అంతస్తు, రూమ్‌ నెం.204" ముమ్మిడివరం, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్‌ 5

Website:https://konaseema.ap.gov.in/notice_category/recruitment/