Published on Apr 21, 2025
Government Jobs
ఏపీ డీఎస్సీ 2025
ఏపీ డీఎస్సీ 2025

మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువెనైల్‌ సంక్షేమ పాఠశాలల్లోని ఖాళీలకు జిల్లా స్థాయిలో నియామకాలు చేపడతారు. బధిర, అంధుల పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని పోస్టులను రాష్ట్ర, జోనల్‌ స్థాయిల్లో భర్తీ చేయనున్నారు.

మొత్తం పోస్టులు:  16,347 (జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర, జోనల్‌ స్థాయిలో 2,259 పోస్టులు).

వివరాలు:

అన్ని రకాల ఎస్జీటీ పోస్టులు 6,599, స్కూల్‌ అసిస్టెంట్లు 7,487, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు రెండు కలిపి 14,088 పోస్టులున్నాయి. రాష్ట్ర స్థాయి పోస్టులు 259. జోన్‌-1లో 400, జోన్‌-2లో 348, జోన్‌-3లో 570, జోన్‌-4లో 682 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో మొత్తం 13,192 ఖాళీలు ఉండగా.. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881,  జువెనైల్‌ పాఠశాలల్లో 15, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బధిరులు, అంధుల పాఠశాలల్లో 31 పోస్టులు ఉన్నాయి.

జువెనైల్‌ సంక్షేమ విభాగం పాఠశాలల్లో ఖాళీలు: 15

(ఎస్జీటీ- 13; పీఈటీ- 02)

జోన్ల వారీగా ఖాళీలు: 2,228

(ప్రిన్సిపల్‌- 52; పీజీటీ-273; టీజీటీ- 1,718; పీడీ- 13; పీఈటీ- 172)

దివ్యాంగుల పాఠశాలల్లో ఖాళీలు: 31

(బధిరుల పాఠశాల- 11; అంధుల పాఠశాల- 20)

జిల్లా స్థాయి పోస్టులు:  13,192

(ఎస్‌ఏ భాష-1: 534; ఎస్‌ఏ పీఈటీ- 1,664; ఎస్జీటీ- 5,985; ఇతర సబ్జెక్ట్‌ టీచర్‌ పోస్టులు 5,009)

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీలు(జిల్లా స్థాయి)- 881

(ఎస్‌ఏ పీఈటీ- 06; ఎస్జీటీ- 601; ఇతర సబ్జెక్ట్‌ టీచర్‌ పోస్టులు- 274)

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ, బీఎడ్‌, డీఎడ్‌, డీఈఈడీ, ఏపీటెట్‌/సీటెట్‌లో ఉత్తీర్ణత ఉండాలి.

పరీక్ష విధానం: 

ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు పేపర్‌-1గా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వారికి 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లు పరిగణిస్తారు. ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్‌-2 మార్కులు లెక్కిస్తారు.

ప్రిన్సిపల్, పీజీటీలకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. టీజీటీ, స్కూల్‌ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) వెయిటేజీ 20 శాతం ఉంటుంది.

వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 నుంచి 44 సంవత్సరాలు; ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 49 ఏళ్లు; దివ్యాంగులకు 54 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: ఒక్కో పోస్టుకు రూ.750.

డీఎస్సీ2024 లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవల్సిన అవసరం లేదు.  

ముఖ్యమైన తేదీలు: 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 15.05.2025.

పరీక్ష తేదీలు: 06.06.2025 నుంచి 06.07.2025.

హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌: 30.05.2025.

ప్రాథమిక కీ విడుదల: చివరి పరీక్ష తర్వాత 2వ రోజు

కీపై అభ్యంతరాలు: ప్రారంభ కీ నుండి 7 రోజులలోపు

తుది కీ విడుదల: అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత 

మెరిట్‌ జాబితా విడుదల: ఫైనల్‌ కీ తర్వాత ఏడు రోజులకు 

Website:https://apdsc.apcfss.in/