ఏపీ ప్రభుత్వం, పాఠశాల విద్యా విభాగం 2025-26 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డీఈఎల్‌ఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈసెట్)-2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డీఈఈసెట్ ర్యాంకు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్‌లు/ ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు:
ఏపీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(డీఈఈఈసెట్)-2025
కోర్సు: డీఈఎల్‌ఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్)
అర్హతలు: కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: కనిష్ఠంగా సెప్టెంబర్ 1 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.
కేటగిరీ సీట్లు: మ్యాథమెటిక్స్- 25%, ఫిజికల్ సైన్స్- 25%, బయోలాజికల్ సైన్స్- 25%, సోషల్ స్టడీస్- 25%.
ఎంపిక ప్రక్రియ: డీఈఈఈసెట్‌లో సాధించిన ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.750.
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పార్ట్-ఎ 60 మార్కులు- 60 ప్రశ్నలు, పార్ట్-బి 40 మార్కులు- 40 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి.
డీఈఈసెట్-2024 నోటిఫికేషన్ విడుదల: 21.04.2025.
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు తేదీలు: 22.04.2025 నుంచి 07.05.2025 వరకు.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 23.04.2025 నుంచి 08.05.2025 వరకు.
హాల్ టిక్కెట్ల జారీ: 20.05.2025.
ప్రవేశ పరీక్ష తేదీ: 02. 06.2025 & 03.06.2025.
ఫలితాల ప్రకటన: 10.06.2025.
Website:https://apdeecet.apcfss.in/
Apply online:https://apdeecet.apcfss.in/login