Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 30, 2026
Admissions
ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు
ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 31 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అయిదో తరగతి ప్రవేశాల సీట్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (గురుకులం) నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఎంపికైన విద్యార్థులకు స్టేట్‌ సిలబస్‌, ఆంగ్ల మాధ్యమ ఉచిత విద్య, వసతితో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది.

వివరాలు:

5వ తరగతి ప్రవేశాలు 2026-27

సీట్లు: ప్రతి జనరల్ ఎస్టీ గురుకుల పాఠశాలలో మొత్తం 80 సీట్లు ఉంటాయి. ఈ 80 సీట్లను ఒక్కో సెక్షన్‌కు 40 మంది చొప్పున రెండు సెక్షన్లుగా విభజిస్తారు.

రిజర్వేషన్‌: మొత్తం సీట్లలో ఎస్టీలకు 78%, ఎస్సీలకు 12%, బీసీలకు 5%, ఓసీలకు 2%, ఏఈక్యూ కింద 3% కేటాయించారు. అయిదో తరగతి ప్రవేశాలకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. 6, నుంచి 9వ తరగతి బ్యాక్‌లాగ్‌ సీట్లలో ప్రవేశాలకు ఎస్టీ విద్యార్థులు మాత్రమే దరఖాస్తుకు అవకాశం ఉంటుంది (వీటీ కోసం విడిగా ఆయా విద్యా సంస్థల స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు). 

అర్హత: విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో లేదా ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో (GAHS) లేదా ఇతర గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అలాగే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1,00,000 మించకూడదు.

వయోపరిమితి: ఎస్సీ & ఎస్టీ అభ్యర్థులు 01-09-2013 నుంచి 31-08-2017 మధ్య జన్మించి ఉండాలి.

బీసీ & ఓసీ అభ్యర్థులు: 01-09-2015 నుంచి 31-08-2017 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

పరీక్షా విధానం: ఓఎంఆర్‌ ఆధారిత ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. 4వ తరగతి స్థాయి సిలజస్‌లో మొత్తం 50 మార్కులకు నిర్వహిస్తారు. తెలుగు-10 మార్కులు, ఇంగ్లిష్‌-10 మార్కులు, గణితం-15 మార్కులు, ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌-15 మార్కులకు పరీక్ష ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 05-02-2026.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28-02-2026.

హాల్ టిక్కెట్‌ డౌన్‌లోడ్ ప్రారంభం: 10.03.2026.

ప్రవేశ పరీక్ష తేదీ: 04-04-2026.

మెరిట్ జాబితా వెల్లడి: 29.04.2026.

Website:https://twreiscet.apcfss.in/