Published on May 12, 2025
Current Affairs
ఏపీ క్యాబినెట్‌ నిర్ణయాలు
ఏపీ క్యాబినెట్‌ నిర్ణయాలు

రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతి అన్న పదాన్ని చేర్చి, ఈ మేరకు 2014లో చేసిన చట్టానికి సవరణ చేయాలని 2025,  మే 8న ఏపీ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించింది.

సీఆర్‌డీఏ చట్టంలో అమరావతి రాజధాని ప్రాంతంగా ఏయే ప్రాంతాలను పేర్కొన్నారో అవన్నీ అమరావతి రాజధానిగా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

ఇతర నిర్ణయాలు:

అమృత్‌ 2.0 పథకంలో రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో జల కార్యాచరణ చేపట్టేందుకు కేంద్రం 36.5% నిధులు ఇచ్చింది. ఈ పథకాన్ని వినియోగించుకునేందుకు హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

దీని ద్వారా రూ.6,777 కోట్లు ఖర్చు చేస్తారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.2,947.67 కోట్లు ఇస్తుంది. మిగిలింది యాన్యుటీ పద్ధతిలో చేయాలని మంత్రిమండలి తీర్మానించింది.

ఈ విధానంలో తీసుకున్న నిధులు 10.15% వడ్డీతో 40 వాయిదాల్లో ప్రాజెక్టు పూర్తయిన రెండేళ్ల తర్వాత తిరిగి చెల్లిస్తారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,350 కోట్ల లబ్ధి కలుగుతుంది.