Published on Sep 5, 2025
Government Jobs
ఏపీ కుటుంబ వైద్య ఆరోగ్య శాఖలో పోస్టులు
ఏపీ కుటుంబ  వైద్య ఆరోగ్య శాఖలో పోస్టులు

గుంటూరు జిల్లాలోని బాపట్ల, నరసరావుపేట ఏరియా హాస్పిటల్స్‌ (ఏపీ డీసెహెచ్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 28

వివరాలు:

1. డాక్టర్‌: 02

2. ప్రాజెక్ట్‌ కో-ఆర్డినేటర్‌ కమ్ ఒకేషనల్‌ కౌన్సిలర్‌: 02

3. నర్స్‌: 04

4. వార్డ్‌ బాయ్‌: 04

5. కౌన్సిలర్‌/సోషల్ వర్కర్‌/సైకాలజిస్ట్‌: 04

6. అకౌంటెంట్‌ కమ్‌ క్లర్క్‌: 02

7. పీర్‌ ఎడ్యుకేటర్‌: 02

8. చౌకీదార్‌: 04

9. హౌస్‌కీపింగ్‌ వర్క్‌: 02

10. యోగా థెరపిస్ట్‌/డాన్స్‌/మ్యూజిక్‌/ఆర్ట్‌ టీచర్‌(పార్టైమ్‌): 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 5, 8వ తరగతి, ఎంబీబీఎస్‌, డిగ్రీ, ఏఎన్‌ఎం ఉత్తీర్ణతతో పాటు సైకిల్‌ తొక్కడం, తెలుగులో చదవడం, రాయడం వచ్చి ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 42 ఏళ్లు,

జీతం: నెలకు డాక్టర్‌కు రూ.60,000, ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్‌ కమ్ ఒకేషనల్‌ కౌన్సిలర్‌కు రూ.25,000, నర్స్‌కు రూ.15,000, వార్డ్‌ బాయ్‌కు రూ.13,000, కౌన్సిలర్‌/సోషల్‌ వర్కర్‌/సైకాలజిస్ట్‌కు, అకౌంటెంట్‌ కమ్‌ క్లర్క్‌కు రూ.12,000, ప్రీ ఎడ్యుకేటర్‌కు రూ.10,000, చౌకీదార్‌కు రూ.9,000, హౌస్‌ కీపింగ్‌ వర్క్‌కు రూ.9,000, యోగా థెరిపిస్ట్‌/డాన్స్‌/మ్యూజిక్‌/ఆర్ట్‌ టీచర్‌కు రూ.5000.

దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.300, బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.100.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 సెప్టెంబర్ 16.

Website:https://guntur.ap.gov.in/notice_category/recruitment/