విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఏపీసీఓబీ) స్టాఫ్ అసిస్టెంట్, మేనేజర్ స్కేల్-I పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 38
వివరాలు:
స్టాఫ్ అసిస్టెంట్: 13
మేనేజర్ స్కేల్-I: 25
అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్థానిక అభ్యర్థి అయి ఉండాలి. తెలుగు భాషలో ప్రావీణ్యం అవసరం, ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారికి ప్రాధాన్యత.
వయోపరిమితి: 01.07.2025 నాటికి స్టాఫ్ అసిస్టెంట్‌కు 20-28 సంవత్సరాలు; మేనేజర్ స్కేల్‌కు 20 - 30 ఏళ్ల మధ్య ఉండాలి.( ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; బీసీలకు మూడేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయసడలింపు వర్తిస్తుంది).
జీతం: స్టాఫ్ అసిస్టెంట్‌కు రూ.24,050 నుంచి రూ.64,480; మేనేజర్ స్కేల్-Iకు రూ.48,480 నుంచి రూ.85,920.
ఎంపిక విధానం: స్టాఫ్ అసిస్టెంట్‌కు ఆన్‌లైన్ ఆధారిత రాత పరీక్ష (200 మార్కులు, 2 గంటలు; మేనేజర్‌కు ఆన్‌లైన్ ఆధారిత రాత పరీక్ష (200 మార్కులు, 2:30 గంటలు) + ఇంటర్వ్యూ. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.590, ఇతరుల ఫీజు రూ.826.
పరీక్షా కేంద్రాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 10.09.2025
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 10.09.2025
ఆన్‌లైన్ పరీక్ష: సెప్టెంబర్/అక్టోబర్ 2025
Website:https://apcob.org/careers/