Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 30, 2026
Admissions
ఏపీ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు
ఏపీ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 28 ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ ప్రకటన వెలువడింది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, విద్య అందిస్తారు. బోధనా మాధ్యమం ఆంగ్లంలో సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తారు. 

వివరాలు:

ఏపీ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో 6వ తరగతి అడ్మిషన్లు

సీట్ల వివరాలు: ప్రతి ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయంలో ఆరో తరతగతిలో 60 సీట్ల చొప్పున మొత్తం 1,680 (840 బాలురు, 840 బాలికలు) సీట్లు ఉన్నాయి. 

అర్హతలు: ఆరో తరతగతిలో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా 2025-26 విద్యాసంవత్సరంలో 5వ తరగతి ఏ‘దైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివి ఉండాలి. (పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే చదువుకున్న విద్యార్థులు కూడా ఆర్‌టీఈ (RTE) చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి తల్లిదండ్రుల స్వయం ధ్రువవీకరణ పత్రం అవసరం). విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష మించకూడదు. (వైట్‌ రేషన్‌ కార్డు ఉన్నవారికి ఆధాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదు).

వయోపరిమితి: మార్చి 31, 2026 నాటికి విద్యార్థి వయసు 10-13 ఏళ్ల మధ్య ఉండాలి. దివ్యాంగ విద్యార్థులకు గరిష్ఠ వయోపరిమితిలో రెండేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

పరీక్ష విధానం: 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. మెంటల్‌ ఎబిలిటీ (50 ప్రశ్నలు), అరిథ్‌మెటిక్‌ (25 ప్రశ్నలు), లాంగ్వేజ్‌ (తెలుగు, ఇంగ్లిష్ లేదా రీజినల్‌- 25 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ: 05-02-2026.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 28-02-2026.

అడ్మిట్‌ కార్డుల విడుదల: 10.03.2026.

ప్రవేశ పరీక్ష నిర్వహణ: 04.04.2026.

మొదటి మెరిట్ జాబితా: 24.04.2026.

ఎంపికైన విద్యార్థుల జాబితా వెల్లడి: 29.04.2026.

Website:https://twreiscet.apcfss.in/