ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని డా.ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఏపీ ఎన్‌సెట్) 2025-26 విద్యా సంవత్సరానికి నాలుగేళ్ల బీఎస్సీ(నర్సింగ్) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దీని ద్వారా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో, ప్రైవేట్ అన్-ఎయిడెడ్, నాన్ మైనారిటీ, మైనారిటీ నర్సింగ్ కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు.
వివరాలు:
బీఎస్సీ నర్సింగ్ (నాలుగేళ్లు)
మొత్తం సీట్లు: 13,726.
అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్(బైపీసీ)/ టెన్+2 ఉత్తీర్ణత, సైన్స్ గ్రూప్, ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా తప్పనిసరి కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.12.2025 నాటికి 17ఏళ్లు నిండి ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: ఆన్‌లైన్ ఎన్‌సెట్ ప్రవేశ పరీక్ష మొత్తం 100 మార్కులకు అబ్జెక్టీవ్ తరహాలో 2 గంటల పాటు ఉంటుంది. ఇంటర్మీడియట్ బైపీసీ సిలబస్ ఆధారంగా పరీక్షల నిర్వహిస్తారు. నర్సింగ్ ఆప్టిట్యూడ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల నుంచి 20 మార్కుల చొప్పున మార్కులు కేటాయిస్తారు. పరీక్ష ఇంగ్లిష్, తెలుగు మాధ్యమంలో ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.1180; బీసీ/ ఎస్సీ/ ఎస్టీ వారికి రూ.944.
ముఖ్య తేదీలు:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 20.06.2025.
ప్రవేశ పరీక్ష: 06.07.2025.
హాల్ టికెట్లు డౌన్‌లోడింగ్: జూన్ 25 నుంచి.
ప్రాథమిక కీ: 07.07.2025.
కీ పై అభ్యంతరాలకు గడువు: జులై 7 నుంచి 9వ తేదీ వరకు.
Website:https://drntr.uhsap.in/index/
Apply online:https://apuhs-ncet.aptonline.in/NCET/Home/Home