ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 (ఈఏపీసెట్) నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (జేఎన్‌టీయూకే) నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్
అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు:
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 (ఏపీ ఈఏపీసెట్)
1. ఇంజినీరింగ్, బయో-టెక్నాలజీ, బీటెక్ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)
2. బీఎస్సీ (అగ్రి)/ బీఎస్సీ (హార్జికల్చర్)/ బీవీఎస్సీ & ఏహెచ్/ బీఎఫ్‌ఎస్సీ.
3. బీఫార్మసీ, ఫార్మ్.డి
అర్హత: ఇంటర్మీడియట్(ఎంపీసీ/ బైపీసీ)లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరి.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.600(ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.500; బీసీ అభ్యర్థులకు రూ.550).
మార్చి 15- ఏప్రిల్ 24 వరకు: ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల సమర్పణ
ఏప్రిల్ 25- మే 16 వరకు: రూ.1000 నుంచి రూ.10 వేల వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం
మే 12 నుంచి: డౌన్‌లోడ్ చేసుకోవడానికి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్ల అందుబాటు
ఈఏపీసెట్ పరీక్షలు: త్వరలో వెల్లడికానున్నాయి.
అగ్రికల్చర్ అండ్ ఫార్మసి పరీక్షల తేదీలు: మే 19, 20
ఇంజినీరింగ్ పరీక్ష తేదీలు: మే 21 నుంచి 27వ తేదీ వరకు.
ప్రిలిమినరీ కీ (అగ్రికల్చర్ అండ్ ఫార్మసి): మే 21
ప్రిలిమినరీ కీ (ఇంజినీరింగ్): మే 28
తుది కీ: జూన్ 6
Website: https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx
Apply online: https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx