Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 10, 2026
Admissions
ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026
ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026

ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026 (ఏపీ ఐసెట్‌) నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2026 విద్యా సంవత్సరానికి ఏపీ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫుల్‌ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

వివరాలు:

ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026(ఏపీ ఐసెట్‌)

కోర్సులు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)/ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(ఎంసీఏ)

అర్హత: ఎంబీఏకు డిగ్రీ ఉత్తీర్ణత, ఎంసీఏకు (ఇంటర్‌/ డిగ్రీ స్థాయిలో గణితం సబ్జె్క్టు చదివి ఉండాలి) ఉత్తీర్ణులై ఉండాలి. 

దరఖాస్తు రుసుము: రూ.750 (బీసీలకు రూ.700; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.650).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఫిబ్రవరి 5 నుంచి మార్చి 2వ తేదీన వరకు.

రూ.1000 ఆలస్య రుసుముతో: 07.03.2026 వరకు.

రూ.2000 ఆలస్య రుసుముతో: 12.03.2026.

రూ.4000 ఆలస్య రుసుముతో: 17.03.2026.

రూ.10,000 ఆలస్య రుసుముతో: 21.03.2026.

కరెక్షన్‌ విండో: 23.03.2026.

హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: 15.04.2026.

పరీక్ష తేదీ: 02-05-2026.

ప్రిలిమినరీ కీ విడుదల తేదీ: 05-05-2026 (05:00 PM).

ఫలితాలు విడుదల: 16-05-2026.

Website:https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage