Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 20, 2026
Admissions
ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలు
ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్‌లోని 164 మోడల్‌ స్కూల్స్‌లలో 2026-27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

ఏపీ మోడల్ స్కూల్స్ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష-2026

అర్హత: సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి(తెలుగు/ఇంగ్లిష్‌ మీడియాల్లో) చదివి ఉండాలి.

వయోపరిమితి: ఓసీ, బీసీ విద్యార్థులు 01-09-2014 నుంచి 31-08-2016 మధ్య; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01-09-2012 నుంచి 31-08-2016 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

పరీక్ష రుసుము: ఓసీ, బీసీలకు రూ.200; ఎస్సీ, ఎస్టీలకు రూ.125.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-03-2026.

ప్రవేశ పరీక్ష తేదీ: 12.04.2026.

ఫలితాల వెల్లడి: 27-04-2024.

మెరిట్‌ లిస్ట్‌/ఎంపిక జాబితా వెల్లడి: 27.04.2026.

ధ్రువపత్రాల పరిశీలన, కౌన్సెలింగ్ తేదీ: 30-04-2026.

తరగతుల ప్రారంభం: జూన్‌ 2026.

Website:https://apms.apcfss.in/