నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఐదు కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటిలో ఒకదాన్ని ఆంధ్రప్రదేశ్‌లో పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ తరహా కేంద్రాలు ప్రస్తుతం ముంబయి, హైదరాబాద్‌ల్లో మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రపంచ ఆర్థిక వేదిక ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ప్రభుత్వాలు, పరిశ్రమలతో కలిసి ఆచరణాత్మక విధానాలు రూపొందించడం, పైలట్ ప్రాజెక్టులు, ఆయా ప్రాంతాల ప్రాధాన్యతలను గుర్తించడంలో ఈ కేంద్రం కీలకంగా వ్యవహరిస్తుంది.