ఆంధ్రప్రదేశ్‌లో భూగర్భజలాలు 2024తో పోలిస్తే సగటున మీటరు మేర పెరిగాయి. 2024 ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా సగటున భూ ఉపరితలం నుంచి 9.75 మీటర్ల లోతులో నీళ్లు అందుబాటులో ఉండగా 2025 ఫిబ్రవరి నాటికి 8.82 మీటర్లకే జలాలు కనపడుతున్నాయి.
రెండు రుతుపవనాలలో కలిపి 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 883.2 మి.మీ. సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇంత వరకు 963.8 మి.మీ. మేర వర్షాలు పడ్డాయి.
8 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఉంది. రాయలసీమ 8 జిల్లాల్లో సగటున 0.83 మీటర్ల మేర నీటిమట్టాలు పెరగగా కోస్తాంధ్రలోని 18 జిల్లాల్లో ఇది 0.98 మీటర్లుగా ఉంది.