- 2026, ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవికా మిషన్(గ్రామీణ)’ (వీబీ జీ రామ్ జీ) అమలులోకి రానుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2026, మార్చి వరకు పాత విధానంలోనే ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయనున్నారు.
- జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (నరేగా) కేంద్ర ప్రభుత్వం సవరించి కొత్తగా ‘వీబీ జీ రామ్ జీ’ని తీసుకొచ్చింది.