ఏపెక్-1 చిప్
భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఏపెక్-1 అనే చిప్‌ను ఉత్పత్తి చేసింది.
ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఉన్న ఐఐటీ-ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ పరిశోధకులు ఈ సాధనాన్ని రూపొందించగా.. మొహాలీలోని సెమీకండక్టర్ లేబొరేటరీ దీన్ని ఉత్పత్తి చేసింది.
ప్రధానంగా ఇది.. చూపులేనివారి కోసం స్మార్ట్ కళ్లద్దాలను తయారుచేయడానికి ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు.