Published on Oct 19, 2024
Government Jobs
ఏపీఎస్‌డీపీఎస్‌లో కన్సల్టెంట్ పోస్టులు
ఏపీఎస్‌డీపీఎస్‌లో కన్సల్టెంట్ పోస్టులు

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (ఏపీఎస్‌డీపీఎస్‌) - ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ స్వర్ణాంధ్ర@2047 విజన్‌ ప్రాజెక్ట్ కోసం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు అహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య‌: 13

వివ‌రాలు:

1. ప్రోగ్రామ్/ ప్రాజెక్ట్ మేనేజర్/ సీనియర్ అనలిస్ట్/ సీనియర్ అడ్వైజర్: 04

2. కన్సల్టెంట్/ రిసెర్చ్ అసోసియేట్స్‌: 08

3. డేటాబేస్ డెవలపర్: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (కంప్యూటర్స్‌), పీజీ లేదా డాక్టరేట్ (పబ్లిక్ పాలసీ/ ఎకనామిక్స్‌/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ ఇంజినీరింగ్/ డెవలప్‌మెంట్ స్టడీస్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు రూ.2,00,000- రూ.2.5 లక్షలు; కన్సల్టెంట్ పోస్టులకు రూ.75,000 - రూ.1.50,000; డేటాబేస్ డెవలపర్ పోస్టులకు రూ.45,000 - రూ.75,000.

వయోపరిమితి: 01-01-2025 నాటికి ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు 55 ఏళ్లు;  కన్సల్టెంట్ పోస్టులకు 45 ఏళ్లు; డేటాబేస్ డెవలపర్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. 

పని ప్రదేశం: విజయవాడ, ఆంధ్రప్రదేశ్.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్‌, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 29-10-2024.

Website:http://www.apsdps.ap.gov.in/

Apply online:https://apsdpscareers.com/