Published on Sep 25, 2024
Current Affairs
ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణరావు
ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణరావు

మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావును ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం 2024, సెప్టెంబరు 24న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆయన మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఇతర నామినేటెడ్‌ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది.
* అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు సత్యనారాయణ ఏపీ అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
* మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌గా కర్రోతు బంగార్రాజు నియమితులయ్యారు.

కార్పొరేషన్ల ఛైర్మన్లుగా నియమితులైన వారు

S.no  బోర్డు పేరు అసెంబ్లీ నియోజకవర్గం
1) వక్ఫ్‌ బోర్డు అబ్దుల్‌ అజీజ్‌   నెల్లూరు గ్రామీణం 
2) క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌)  అనిమిని రవినాయుడు   తిరుపతి
3) హౌసింగ్‌ బోర్డు బత్తుల తాతయ్యబాబు చోడవరం
4) గిరిజన ఆర్థిక సహకార సంస్థ (ఏపీ ట్రైకార్‌)  బొరగం శ్రీనివాసులు పోలవరం
5) ఏపీ మారిటైమ్‌ బోర్డు  దామచర్ల సత్య   కొండపి
6) సొసైటీ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్, 
ఎంటర్‌ప్రైజెస్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ ఏపీ (సీడాప్‌)
దీపక్‌రెడ్డి రాయదుర్గం
7) మార్క్‌ఫెడ్‌ కర్రోతు బంగార్రాజు నెల్లిమర్ల
8) రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మన్నె సుబ్బారెడ్డి డోన్‌
9) ఏపీ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) మంతెన రామరాజు  ఉండి
10) పద్మశాలి సంక్షేమ, అభివృద్ధి సంస్థ నందం అబద్ధయ్య మంగళగిరి
11) పర్యాటకాభివృద్ధి సంస్థ నూకసాని బాలాజీ కొండపి (ఎస్సీ)
12) ఏపీఎస్‌ఆర్టీసీ కొనకళ్ల నారాయణరావు మచిలీపట్నం
13) పట్టణ ఆర్థిక, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ పీలా గోవింద సత్యనారాయణ అనకాపల్లి 
14) తోలు పరిశ్రమల అభివృద్ధి సంస్థ పిల్లి మాణిక్యరావు చీరాల
15) వినియోగదారుల రక్షణ మండలి పీతల సుజాత భీమవరం
16) ట్రేడ్‌ ప్రమోషన్‌ సంస్థ(ఏపీటీపీసీ) వజ్జ బాబురావు పలాస
17) ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి సంస్థ తమ్మిరెడ్డి శివశంకర్‌ (జనసేన) కురుపాం
18) పౌరసరఫరాల సంస్థ  తోట మెహర్‌ సీతారామ 
    సుధీర్‌ (జనసేన)
కాకినాడ నగరం
19) టిడ్కో వేములపాటి అజయ్‌కుమార్‌ (జనసేన) నెల్లూరు నగరం
20) 20 సూత్రాల అమలు కమిటీ   లంకా దినకర్‌ (భాజపా) ఒంగోలు 
21) ఏపీఎస్‌ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం కుప్పం