Published on Nov 4, 2025
Government Jobs
ఏపీఈడీఏ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలు
ఏపీఈడీఏ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలు

న్యూదిల్లీలోని అగ్రికల్చరల్‌ అండ్‌ ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ (ఏపీఈడీఏ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 06

వివరాలు:

అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) - 01

అసిస్టెంట్‌ మేనేజర్‌ (అగ్రికల్చర్‌): 01

అసిస్టెంట్‌ మేనేజర్‌: 04

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, యూజీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌కు 35 ఏళ్లు; అసిస్టెంట్‌ మేనేజర్‌కు 30 ఏళ్లు మించకూడదు. 

జీతం: నెలకు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌కు రూ.56,100- రూ.1,77,500; అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.35,400- రూ.1,12,400

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 01-12-2025.

Website: https://apeda.gov.in/