ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా పెట్టేందుకు కర్ణాటక అటవీ శాఖ స్వదేశీ ట్రాకర్‌ను రూపొందించి, వినియోగంలోకి తెచ్చింది.
కేపీ (కర్ణాటక పేటెంటెడ్)-ట్రాకర్‌గా పిలిచే రేడియో కాలర్‌ను అటవీశాఖ ప్రధాన ఉన్నతాధికారి కుమార్ పుష్కర్, ఇన్‌ఫిక్షన్ ల్యాబ్స్ సంయుక్త ఆధ్వర్యంలో తయారు చేశారు.
దీని బరువు 7 కిలోలు. ఇది బ్యాటరీ సాయంతో నడుస్తుంది. మందలో ఒక ఏనుగుకు ట్రాకర్‌ను అమర్చితే అది వెళ్లే దిశ కంట్రోల్ రూంలో తెలుస్తుంది.
దాంతో మంద ఎటు వెళ్తుందో తెలుసుకొని అటవీ శాఖ అధికారులు అప్రమత్తమవుతారు.