ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) కార్యనిర్వాహక సంచాలకుడి (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-ఈడీ)గా భారత్ తరఫున లొల్ల సత్యశ్రీనివాస్ 2025, సెప్టెంబరు 14న నియమితులయ్యారు. ఈయన ఏపీకి చెందిన 1991 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి. ఆయన స్వస్థలం గుంటూరు. శ్రీనివాస్ ప్రస్తుతం కేంద్ర వాణిజ్యశాఖలో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు. ఆయన్ను ఏడీబీ ఈడీగా నియమించాలని కేంద్ర నియామక వ్యవహారాల క్యాబినెట్ నిర్ణయించింది.