ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో ఇటలీ స్టార్ యానెక్ సినర్ విజేతగా నిలిచాడు. 2024, నవంబరు 18న ట్యూరిన్ (ఇటలీ)లో జరిగిన పురుషుల సింగిల్స్ తుదిపోరులో అతడు 6-4, 6-4తో ఫ్రిట్జ్ (అమెరికా)ను ఓడించాడు.
ఈ పోరులో 14 ఏస్‌లు సంధించిన సినర్.. రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
ఈ ఏటీపీ సీజన్లో జోరు కొనసాగిస్తున్న అతడు గత 27 మ్యాచ్‌ల్లో 26 విజయాలు సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ టైటిళ్లు గెలిచి నంబర్‌వన్ ర్యాంకునూ సొంతం చేసుకున్నాడు.