ప్రముఖ న్యాయకోవిదుడు, రాజ్యాంగ నిపుణుడు, రచయిత ఏజీ నూరానీ (94) 2024, ఆగస్టు 29న ముంబయిలో మరణించారు. ఈయన పూర్తి పేరు అబ్దుల్ గఫూర్ మజీద్ నూరానీ. 1930 సెప్టెంబరు 16న ముంబయిలో జన్మించారు. న్యాయవాదిగా కెరీర్‌ను ప్రారంభించిన నూరానీ బొంబాయి హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. రచయితగా, రాజకీయ వ్యాఖ్యాతగా చాలా పేరు సంపాదించుకున్నారు.