పోలీసింగ్‌లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని పెంచేందుకు ఏపీ పోలీసు శాఖ ‘ఏఐ 4 ఏపీ పోలీస్’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. సంప్రదాయ విధుల నుంచి డేటా, సాక్ష్యాల ఆధారిత, ఏఐ సహాయ పోలీసింగ్ వైపు మళ్లేందుకు వీలుగా ఈ ప్రాజెక్టులో 8 ఏఐ మాడ్యూల్స్‌ను సిద్ధం చేసింది. అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో వీటిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. వచ్చే 6 నెలల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నారు. డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా చొరవతో సాంకేతిక సేవల విభాగం ఐజీ సీహెచ్ శ్రీకాంత్ పర్యవేక్షణలో ‘ఏఐ 4 ఏపీ పోలీస్’ సిద్ధమైంది.