‘కృత్రిమ మేధ (ఏఐ) నిపుణుల నియామకంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలించిందని ‘ఏఐ ఇండెక్స్ 2025’ నివేదిక పేర్కొంది. కానీ, ఈ ప్రతిభను నిలబెట్టుకోవడంలో ఇబ్బందులు పడుతోంది. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, మేధో సంపత్తి హక్కులను పొందడంలో సవాళ్లను ఎదుర్కొంటోంది వెల్లడించింది. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఈ నివేదికను తయారు చేసింది.