Published on May 20, 2025
Current Affairs
ఏఐ ఆధారిత డయాగ్నొస్టిక్‌
ఏఐ ఆధారిత డయాగ్నొస్టిక్‌

దేశంలో మొదటిసారిగా హైదరాబద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి నిలోఫర్‌లో సూదితో పొడవాల్సిన అవసరం లేకుండా రక్తపరీక్ష చేసే ‘ఏఐ ఆధారిత డయాగ్నొస్టిక్‌(ఫొటో ప్లెథిస్మోగ్రఫీ-పీపీజీ)’ను అందుబాటులోకి తెచ్చారు.

అమృత్‌ స్వస్థ్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఈ సాధనాన్ని క్విక్‌ వైటల్స్‌ సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చారు. 

రక్తపరీక్షలు చేయించుకుంటే రిపోర్టుల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.

కానీ ఈ పీపీజీ పరికరం మన ముఖాన్ని స్కాన్‌ చేసి ఒక్క నిమిషంలోపు ఫలితాలు అందిస్తుంది.