అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), భారత ప్రభుత్వం విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2025- 26 విద్యాసంవత్సరానికి ఏఐసీటీఈ పీజీ స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఎంఈ/ ఎంటెక్/ ఎం.డిజైన్ కోర్సులకు ఆమోదించిన సీట్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు గేట్/ సీఈఈడీ స్కోర్ ఆధారంగా నెలకు రూ.12,400 స్కాలర్‌షిప్ అందించనుంది.
వివరాలు:
ఏఐసీటీఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) స్కాలర్‌షిప్ 2025-26
అర్హత: విద్యార్థులు ఏఐసీటీఈ ఆమోదం పొందిన సంస్థలలో 2025-26 విద్యాసంవత్సరపు ఆమోదిత సీట్లలో ప్రవేశం పొంది ఉండాలి. చెల్లుబాటు అయ్యే గేట్/ సీఈఈడీ స్కోర్ కార్డు కలిగి ఉండాలి.
వయోపరిమితి: ప్రత్యేక వయో పరిమితి లేదు.
ముఖ్య సమాచారం:
గేట్/సీఈఈడీ స్కోర్ కార్డు స్కాన్ కాపీ
ఆధార్ లింక్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ ఖాతా (నో-ఫిల్/జన్‌ధన్/జాయింట్ ఖాతాలు అనుమతించబడవు)
ఆధార్ కార్డు స్కాన్ కాపీ
కేటగిరీ సర్టిఫికెట్ (ఇటీవలి ఒక సంవత్సరం లోపు జారీ చేసినదై ఉండాలి)
దరఖాస్తు విధానం:
విద్యార్థులు మొదట తమ Unique IDను సంబంధిత సంస్థ నుంచి పొందాలి. అనంతరం https://pgscholarship.aicte.gov.in/
వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. అవసరమైన పత్రాలను (గేట్/సీఈఈడీ స్కోర్‌కార్డు, ఆధార్, బ్యాంక్ వివరాలు, కేటగిరీ సర్టిఫికెట్) అప్‌లోడ్ చేయాలి. సంబంధిత సంస్థ విద్యార్థుల వివరాలను ధ్రువీకరించి అర్హతను ఆమోదిస్తుంది.
దరఖాస్తులు ప్రారంభం: 01.09.2025
ఇన్‌స్టిట్యూట్ ద్వారా యునిక్ ఐడీకి చివరి తేదీ: 10.12.2025
దరఖాస్తు చివరి తేదీ: 15.12.2025
ఇన్‌స్టిట్యూట్ ధ్రువీకరణ చివరి తేదీ: 31.12.2025
Website:https://www.aicte.gov.in/