Published on Dec 27, 2024
Current Affairs
‘ఏఐ’పై 8 మందితో కమిటీ
‘ఏఐ’పై 8 మందితో కమిటీ

ఆర్థిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ)ను బాధ్యతాయుతంగా, నైతికతతో తీసుకొచ్చేందుకు ఒక నియమావళిని అభివృద్ధి చేయడానికి 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 2024, డిసెంబరు 26న ప్రకటించింది.

దీనికి ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం) పుష్పక్‌ భట్టాచార్య నేతృత్వం వహించనున్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా, మన దేశంలో ఆర్థిక సేవల్లో ఏఐ ప్రస్తుత స్థాయిని ఈ ప్యానెల్‌ అంచనా వేస్తుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక రంగంపై దృష్టి సారించి ఏఐపై నియంత్రణ, పర్యవేక్షక విధానాలను కూడా సమీక్షిస్తుంది.

ఏఐ వినియోగంతో ఎదురయ్యే ప్రమాదాలను కూడా గుర్తిస్తుంది. బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఫిన్‌టెక్‌లు, పీఎస్‌ఓలతో పాటు ఆర్థిక సంస్థలకు పర్యవేక్షణ ఫ్రేమ్‌వర్క్‌ను సిఫారసు చేస్తుంది.