Published on Oct 18, 2024
Walkins
ఏఐఏఎస్‌ఎల్‌లో జూనియర్ ఆఫీసర్, డ్యూటీ ఆఫీసర్ పోస్టులు
ఏఐఏఎస్‌ఎల్‌లో జూనియర్ ఆఫీసర్, డ్యూటీ ఆఫీసర్ పోస్టులు

ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్‌ఎల్‌) ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మూడేళ్ల కాలపరిమితికి ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 1066.

వివరాలు:

1. డిప్యూటీ టెర్మినల్ మేనేజర్ - ప్యాసింజర్: 1 పోస్టు

2. డ్యూటీ మేనేజర్ - ప్యాసింజర్: 19 పోస్టులు

3. డ్యూటీ ఆఫీసర్ - ప్యాసింజర్: 42 పోస్టులు

4. జూనియర్ ఆఫీసర్ - కస్టమర్ సర్వీసెస్: 44 పోస్టులు

5. ర్యాంప్ మేనేజర్: 1 పోస్టు

6. డిప్యూటీ ర్యాంప్ మేనేజర్: 6 పోస్టులు

7. డ్యూటీ మేనేజర్ - ర్యాంప్: 40 పోస్టులు

8. జూనియర్ ఆఫీసర్ - టెక్నికల్ 31 పోస్టులు

9. డిప్యూటీ టెర్మినల్ మేనేజర్ - కార్గో: 2 పోస్టులు

10. డ్యూటీ మేనేజర్ - కార్గో: 11 పోస్టులు

11. డ్యూటీ ఆఫీసర్ - కార్గో: 19 పోస్టులు

12. జూనియర్ ఆఫీసర్ - కార్గో: 56 పోస్టులు

13. పారా మెడికల్ కమ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 1 పోస్టు

14. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్/ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 524 పోస్టులు

15. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 170 పోస్టులు

16. యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: 100 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, డ్రైవింగ్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, పర్సనల్/ వర్చువల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థుల ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  

ఇంటర్వ్యూ తేదీలు: 22.10.2024, 23.10.2024, 24.10.2024, 25.10.2024, 26.10.2024.

వేదిక: జీఎస్‌డీ కాంప్లెక్స్, సహార్ పోలీస్ స్టేషన్ దగ్గర, సీఎస్‌ఎంఐ విమానాశ్రయం, టెర్మినల్-2, గేట్ నం.5, సహర్, అంధేరి-ఈస్ట్, ముంబయి.

Website:https://www.aiasl.in/Recruitment