గుజరాత్‌లోని ఆనంద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ఏఏయూ) ఒప్పంద ప్రాతిపదికన రిసెర్చ్ అసోసియేట్, సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 08
వివరాలు:
1. రిసెర్చ్ అసోసియేట్ - 05
2. సీనియర్ రిసెర్చ్ ఫెలో -03
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ(ఇన్ ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్ / ఫ్లోరికల్చర్ ల్యాండ్‌స్కేప్ ఇన్ ప్లాంట్ పాథాలజీ.ఇన్ సాయిల్ సైన్స్/ సాయిల్ సైన్స్ & అగ్రికల్చరల్ కెమిస్ట్రీ, ఇన్ వెజిటబుల్ సైన్స్, ఇన్ వెజిటబుల్ సైన్స్)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్ల నుంచి 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రిసెర్చ్ అసోసియేట్ కు రూ.67,000. సీనియర్ రిసెర్చ్ ఫెలోకు రూ.37,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 18-11-2025.
వేదిక: యాజ్ఞవల్క్య హాల్, డైరెక్టరేట్ ఆఫ్ రిసెర్చ్, ఆనంద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఆనంద్-388110.
Website:https://aau.in/careers-list